Roger Binny About Rohit Virat Retirement:టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 17ఏళ్లుగా టీమ్ఇండియాకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు అందించిన ఈ స్టార్లు ఇకపై ఈ ఫార్మాట్లో కనిపించరు. ప్లేయర్లుగా, కెప్టెన్లుగా జట్టు బాధ్యతలు మోస్తూ ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు వీరి స్థానాలు భర్తీ చేసేది ఎవరా అని సందిగ్ధం నెలకొంది. దీనిపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు.
రోహిత్, విరాట్ తర్వాత ఎవరు? BCCI బాస్ ఏమన్నారంటే?
Published : Jun 30, 2024, 12:21 PM IST
![రోహిత్, విరాట్ తర్వాత ఎవరు? BCCI బాస్ ఏమన్నారంటే? Roger Binny About Rohit Virat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/1200-675-21831511-thumbnail-16x9-rohit-virat.jpg)
Roger Binny About Rohit Virat (Source: Associated Press)
'రోహిత్, విరాట్ జట్టుకు ఎంతో కృషి చేశారు. ఎప్పటిలాగే ఈ ఇద్దరూ ఐపీఎల్, వన్డే, టెస్టుల్లో ఆడతారు. కానీ, టీ20ల్లో వీరి స్థానాలను భర్తీ చేయడానికి 2-3ఏళ్లు పడతుంది. ప్రస్తుతం ఐపీఎల్లో చాలామంది ప్రతిభావంతులున్నారు. చాలామంది క్రికెటర్లు అక్కడ్నుంచే వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు లేని లోటు పూడ్చడానికి కాస్త సమయం పడుతుంది' అని అన్నారు.