national

ETV Bharat / snippets

గిల్​కు గోల్డెన్ ఛాన్స్- టీమ్ఇండియా కెప్టెన్​గా ప్రమోషన్!

Shubman Gill 2024
Shubman Gill 2024 (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 3:50 PM IST

Shubman Gill 2024:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్​కు బీసీసీఐ మంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టుకు గిల్​ను కెప్టెన్​గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత టీ20 వరల్డ్​కప్ తర్వాత టీమ్ఇండియ జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో 5మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, విరాట్, పాండ్య, బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చి యంగ్ ప్లేయర్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది.

ఈ క్రమంలో యంగ్ టీమ్​ సారథ్య బాధ్యతలను గిల్​కు అప్పగించాలని మేనేజ్​మెంట్ ఆలోచిస్తుందట. అందుకే వరల్డ్​కప్​ స్టాండ్​బై గా అమెరికాలో ఉన్న గిల్​ను స్వదేశం రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పర్యటనకు వెళ్లనున్న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ జట్టులో దాదాపు కుర్రాళ్లకే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాగా, జూలై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details