43 Runs In One Over:ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లో సంచలనం నమోదైంది. ఒకే ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బుధవారం జరిగిన లాసెష్టర్షైర్- ససెక్స్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇది 134ఏళ్ల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో అత్యంత ఖరీదైన ఓవర్. ససెక్స్ బౌలర్ ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌లో లాసెష్టర్షైర్ బ్యాటర్ లూయిస్ కింబర్ ఏకంగా 43 పరుగులు (3 నోబాల్స్) పిండుకున్నాడు. వరుసగా 6, 6nb, 4, 6, 4, 6nb, 4, 6nb, 1 (5 సిక్స్‌లు, 3 ఫోర్లు) బాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత ఖరీదైన ఓవర్‌గా మలిచాడు.
ఒకే ఓవర్లో 43 పరుగులు- 134ఏళ్ల చరిత్రలో రికార్డ్
43 Runs In One Over (Source: Getty Images)
Published : Jun 26, 2024, 7:41 PM IST
ఈ క్రమంలో 27ఏళ్ల ఫస్ట్ క్లాస్ రికార్డు (36 పరుగులు)ను కింబర్ బ్రేక్ చేశాడు. గతంలో ఇది గార్ఫిల్డ్ (నొటింగమ్షైర్), రవిశాస్త్రి (ముంబయి) పేరిట ఉండేది. ఈ ఇద్దరు కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అప్పట్లో ఈ రికార్డు సాధించారు.