national

మదనపల్లె కేసులో కీలక పరిణామం - మాజీ ఎమ్మెల్యే నవాజ్‍ భాషాకు నోటీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 3:41 PM IST

Notice To EX MLA Nawaz Basha
Notice To EX MLA Nawaz Basha (ETV Bharat)

Notice To EX MLA Nawaz Basha :మదనపల్లె సబ్‍ కలెక్టరేట్‍ ఫైళ్ల దహనం కేసులో విచారణ కొనసాగుతోంది. ఏడో రోజు పోలీసులు విచారణ చేపట్టారు. మదనపల్లె మాజీ శాసన సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత నవాజ్‍ భాషా విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె 2వ పట్టణ ఎస్‍ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో రాత్రి నవాజ్‍ భాషా ఇంటి వద్దకు వెళ్ళారు. ఇంట్లో లేకపోవడంతో విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఫోన్‍ ద్వారా సమాచారం అందజేశారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలను పలువురిని విచారించిన పోలీసులు మాజీ శాసనసభ్యుడిని విచారణకు రావాలని కోరడంతో ఆ పార్టీ నేతల్లో అలజడి మొదలైంది.

ABOUT THE AUTHOR

...view details