'నువ్వు రాఖీ కట్టకపోయినా ఎప్పుడు అండగా ఉంటా' - కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
Published : Aug 19, 2024, 12:23 PM IST
KTR Tweet on Kavitha Raksha Bandhan :సోదరి కవిత తనకు పండుగ నాడు రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగ వేళ తన సోదరిని గుర్తు చేసుకుంటూ గతేడాది ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'ఇవాళ రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటాను' అని క్యాప్షన్ జోడించారు. దిల్లీ మద్యం కేసులో కవిత తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు రాఖీ కట్టే వీలు లేకపోవడంతో కేటీఆర్ ట్వీట్ చేశారు.