తెలంగాణ

telangana

జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే- అమెరికాతో కుదిరిన ఒప్పందం

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 10:31 AM IST

Julian Assange Bail
Julian Assange Bail (Associated Press)

Julian Assange Bail : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే బెల్మార్ష్ జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికాతో న్యాయవిభాగంతో నేరాంగికరణ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆయనకు లండన్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను సంపాదించడం, బహిర్గతం చేయడానికి కుట్ర పన్నినట్లు నేరాన్ని యూఎస్‌ కోర్టులో అంగీకరించేందుకు అసాంజే సిద్ధమయ్యారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు కొలిక్కి రానుంది. మరియానా ఐలాండ్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్‌లో ఆయన కోర్టులో హాజరుకానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించడమే కాకుండా అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details