ETV Bharat / snippets

'నాటో' సెక్రెటరీ జనరల్‌గా మార్క్‌ రుట్టే- కీలక సమయంలో బాధ్యతలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 7:05 AM IST

NATO Next Secretary General
NATO Next Secretary General (Associated press)

NATO Next Secretary General : ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి 'నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌' (నాటో)కు తదుపరి సెక్రెటరీ జనరల్‌గా డచ్‌ ప్రధానమంత్రి మార్క్‌ రుట్టే నియమితులయ్యారు. బ్రసెల్స్​లోని నాటో ప్రధాన కార్యలయంలో బుధవారం జరిగిన సమావేశంలో 32 కూటమి సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాటో బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి నాటో సెక్రెటరీ జనరల్​గా బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ, ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవి కోసం రూట్టేకు ప్రత్యర్థిగా రోమన్ అధ్యక్షుడు క్లాస్ ఐహాన్నిస్ రేసులో ఉండగా, గతవారమే ఆయన ఈ పోటీ నుంచి తప్పుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.