ETV Bharat / snippets

'మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుంది'- ట్రంప్​నకు కోర్టులో భారీ ఊరట

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 6:50 AM IST

US Elections 2024
US Elections 2024 (ANI)

US Supreme Court on Trump : 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. అమెరికా రాజ్యాంగం అనుసరించి అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్‌, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు. ఈ నేపథ్యంలోనే హష్​ మనీ కేసులో ట్రంప్​ శిక్షను ఆలస్యంగా అమలు చేయమని న్యాయవాదులు న్యూయార్క్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.