ఉక్రెయిన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన రష్యా- మిస్సైల్స్, డ్రోన్లతో కీవ్‌పై భీకర దాడి!
Published : Aug 30, 2024, 6:54 AM IST
Ukrain F16 Jet Crash :యుద్ధంలో ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మిత్రదేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందిన F-16 ఫైటర్లలో ఒక దాన్ని రష్యా పేల్చివేసింది. ఈ ఘటనలో పైలట్ చనిపోయాడు. భారీ క్షిపణులు, డ్రోన్లను రష్యా వరుసగా ప్రయోగించిందని అందులో 4 క్షిపణుల్ని F16 ఫైటర్లతో కూల్చామని కీవ్ సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ ఇప్పటివరకు సోవియట్ నాటి ఫైటర్‌జెట్లను ఉపయోగిస్తోంది. కీవ్ విజ్ఞప్తి మేరకు పాశ్చాత్య దేశాలు 60 విమానాలు అందించేందుకు అంగీకరించాయి. ఇప్పటివరకు 6 యుద్ధవిమానాల్ని డెలివరీ చేశాయి. కాగా గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దళాలు 5 మిస్సైల్స్, 74 షాహెద్ డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో 2క్షిపణులు, 60 డ్రోన్‌లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. రష్యాలోని రోస్టోవ్, కిరోవ్ ప్రాంతాల్లోని చమురు గిడ్డంగులపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. క్రిమియాపై దాడులకు యత్నించగా తిప్పికొట్టినట్లు ప్రకటన విడుదల చేసింది.
TAGGED:
UKRAIN F16 JET CRASH