తెలంగాణ

telangana

ETV Bharat / snippets

'రిషి సునాక్​కు ఓటమి తప్పదు- 14ఏళ్ల తర్వాత లేబర్​ పార్టీ విన్'- UK ఎగ్జిట్ పోల్స్

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 6:39 AM IST

UK Elections 2024
UK Elections 2024 (Associated Press)

UK Election Exit Polls : బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని కన్సర్వేటివ్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో తేలింది. 14 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించనుందని అంచనాలు వెలువరించాయి. బ్రిటన్‌ కాలమాన ప్రకారం రాత్రి 10గంటలకు పోలింగ్‌ ముగిసింది. బ్రిటన్‌లో మొత్తం 46 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 40 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. రిచ్మండ్‌లో రిషి సునాక్‌ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉత్తర లండన్‌లో లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ తన భార్య విక్టోరియాతో కలిసి ఓటు వేశారు. ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది. లేబర్ పార్టీని అడ్డుకోకుంటే అధిక పన్నులు తప్పవని ఓటు వేసిన తర్వాత సునాక్ బ్రిటన్‌ ప్రజలను హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details