బీరుట్ కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
Published : 9 hours ago
Israel Attack on Lebanon : లెబనాన్ రాజధాని బీరుట్లో అత్యంత రద్దీ ప్రాంతంపై ఇజ్రాయెల్ సోమవారం రాత్రి వైమానిక దాడులకు దిగింది. ఐరాస కార్యాలయం, పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం, పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉన్న కీలక ప్రదేశంపై రెండు క్షిపణులు వచ్చి పడినట్లు లెబనాన్ అధికార వార్తాసంస్థ తెలిపింది. కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా రాయబారి తన పర్యటనను ఆలస్యం చేశారనే వార్తల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ప్రాణనష్టం ఎక్కువగానే ఉండవచ్చని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు.