Mrunal Thakur Bollywood Movie:స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కెరీర్లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. రీసెంట్ పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ 'కల్కి'లో గెస్ట్‌రోల్‌లో మెరిసింది. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్లో ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్- సంజయ్ దత్ సూపర్ హిట్ 'సన్ ఆఫ్ సర్దార్' సీక్వెల్లో మృణాల్ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
స్టార్ హీరోతో మృణాల్ జోడీ- హిట్ మూవీ సీక్వెల్లో ఛాన్స్!
Published : Jul 3, 2024, 7:13 AM IST
అయితే టాలీవుడ్ హిట్ మూవీ 'మర్యాద రామన్న' సినిమాకు అప్పట్లో ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తొలి భాగంలో సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటించగా, సీక్వెల్లో ఆ పాత్రలో మృణాల్ కనిపిచనుందని టాక్. ఇక ఫస్ట్ పార్ట్‌తో సీక్వెల్‌కు ఎలాంటి సంబంధం లేదట. ఈ కథ కొత్తగా ఉంటుందని మూవీటీమ్ తెలిపింది.'ఈ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్లో నటించడానికి మృణాల్ చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. సన్నాహాలు చేస్తున్నాం' అని సన్నిహితవర్గాలు తెలిపాయి. తొలి షెడ్యూల్ షూటింగ్‌ను స్కాట్లాండ్లో ప్లాన్ చేస్తున్నారట.