FahadhFaasil Case Registered : ఫహాద్‌ఫాజిల్ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చుగానీ పుష్ప పోలీస్ విలన్ అంటే గుర్తుపట్టేస్తారు. పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగువారిని బాగా ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈయనపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి, సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు!
Published : Jun 29, 2024, 11:51 AM IST
!['పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు! source ETV Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21824329-667-21824329-1719641895171.jpg)
ఎందుకంటే? -ఫహాద్ పింకేలీ షూటింగ్‌ను అంగమలైలోని ఎర్నాకులం గవర్న్మెంట్ హాస్పిటల్లో చిత్రీకరించారు. గత గురువారం రాత్రంతా చిత్రీకరణ జరపడంతో అక్కడున్న రోగులు ఇబ్బంది పడ్డారట. ఎమర్జెన్సీ రూమ్‌లోనూ చిత్రీకరించడానికి లోపలికి ఎవరినీ అనుమతించలేదట. దీంతో అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా అనుమతిచ్చారని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనాకుమారి మండిపడ్డారు. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఆ ఆరోపణలను అక్కడి నిర్మాతల సంఘం కొట్టిపారేసింది. షూటింగ్ కోసం రూ.10వేలు చెల్లించినట్లు పేర్కొంది.