ETV Bharat / snippets

OTTలో దూసుకెళ్తున్న కాజల్ అగర్వాల్​ కొత్త మూవీ! - ఏ ఓటీటీలో అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 9:41 PM IST

source ETV Bharat
Kajal Aggarwal Sathyabhama OTT (source ETV Bharat)

Kajal Aggarwal Sathyabhama OTT Streaming : స్టార్ హీరోయిన్ కాజల్​ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్​ ఇన్నింగ్స్​లో రాణించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్​గా ఆమె నటించిన సత్యభామ చిత్రం థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించింది. అనంతరం అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో విడుదలైంది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు అనూహ్యంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్​తో ట్రెండ్​లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని సదరు ప్లాట్​ఫామ్​ కూడా అఫీషియల్​గా ప్రకటించింది. కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించారు. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించారు. సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్​ ఆఫీసర్​గా నటించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రస్తుతం కాజల్ ఉమ, కన్నప్ప, ఇండియన్ 3 చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్​ కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.