నార్త్ అమెరికాలో 'కల్కి' విధ్వంసం - RRR రికార్డ్ స్మాష్
Published : Jun 27, 2024, 12:19 PM IST
Kalki 2898 AD Overseas North America Collections : కల్కి 2898 ఏడీ రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్, నార్త్ అమెరికాలో అయితే రచ్చ లేపుతూ విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించనంతగా భారీ స్థాయిలో ప్రీ సేల్స్ జరుపుకుంటూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ చిత్రం నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసేసింది. ఇప్పటికే ఒక మిలియన్‌కుపైగా టికెట్లతో 2.5మిలియన్ డాలర్లను సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు 3.5మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. దీంతో నార్త్ అమెరికాలోనే అత్యధిక ఓపెనింగ్ అందుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది. RRR 3.46 మిలియన్లు రికార్డును బ్రేక్ చేసింది. కాగా, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ అందుకోవడంతో(Kalki 2898 AD Review) తొలి రోజు పక్కా రూ.200 కోట్లు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.