తెలంగాణ

telangana

ETV Bharat / snippets

పవన్ గెలుపుపై విజయ్ దళపతి ట్వీట్​ - ఏమన్నారంటే?

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 9:46 AM IST

http://10.10.50.90:6060/reg-lowres/05-June-2024/202406053170978_0506a_1717559427_10.jpeg
Vijay thalapathy Pawankalyan (Source ETV Bharat)

AP Elections 2024 :ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంపై దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ 100 శాతం స్ట్రైక్​రేట్​తో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడంతో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా పవన్ కల్యాణ్​కు, చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపిన పవన్ కల్యాణ్​ గారికి అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం" అని అన్నారు. అలానే "ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన చంద్రబాబు గారికి అభినందనలు. మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details