national

ETV Bharat / snippets

యూకే నుంచి భారత్​కు లక్ష కిలోల బంగారం తరలింపు

RBI Gold UK To India
RBI Gold UK To India (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 6:55 PM IST

RBI Gold UK To India :బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వద్ద నిల్వ ఉంచిన బంగారాన్ని పెద్ద మొత్తంలో భారతీయ రిజర్వ్​ బ్యాంక్‌ భారత్‌కు తీసుకొచ్చింది. సుమారు లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలోకి RBI చేర్చింది. రవాణా,నిల్వ సర్దుబాట్లలో భాగంగానే RBI ఈ బంగారాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2024 మార్చి ముగిసేనాటికి RBI వద్ద 822.1టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వచేసింది. గత ఏడాది 27.5టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చగా, ఈ ఏడాది పసిడి కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. దేశీయంగా ముంబయి మింట్‌రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో RBI బంగారాన్ని నిల్వ చేస్తుంది. RBI కొనుగోళ్ల జోరుతో బంగారం నిల్వలు పెరగ్గా, దాన్ని విదేశాల్లో నిల్వ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విదేశాల్లోని పసిడి నిల్వలు గణనీయంగా పెరగడం వల్ల, కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకురావాలని RBI నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details