తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్- మళ్లీ క్యాబినెట్లోకి సెంథిల్ బాలాజీ
Published : Sep 28, 2024, 10:25 PM IST
Udhayanidhi Stalin Deputy CM :తమిళనాడు మంత్రివర్గం పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్యోగాల పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.