Electoral Bonds Scheme :ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని, వీటితో క్విడ్‌ప్రోకో జరుగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నతన్యాయస్థానం వాటిని కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
'ఈ దశలో జోక్యం చేసుకోలేం'- ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీం నో
Published : Aug 2, 2024, 3:43 PM IST
క్విడ్‌ప్రో కో జరిగిందన్న ఊహతో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుపై విచారణకు ఆదేశించలేమని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. న్యాయ సమీక్షకు సంబంధించిన అంశమైనందున ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించినట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నేరపూరిత, తప్పులతో కూడిన కేసులకు చట్టపరంగా పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు అవి ఆర్టికల్32 కిందకు రావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.