Actor siddique Bail: నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దిఖీకి రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మందస్తు బెయిల్‌ను నిరాకరించిన కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిద్ధిఖీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, కేరళ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
Published : 9 hours ago
అత్యాచారం కేసులో నటుడు సిద్దిఖీకి ఊరట- ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Actor siddique Bail (ETV Bharat)
2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్లో సిద్దిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేసింది. తమిళ చిత్రంలో ఓ పాత్ర ఇప్పిస్తానని, అందుకు ప్రతిగా కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. అందుకు తాను నిరాకరించగా అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇటీవల మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సిద్దిఖీ ఎంపికయ్యారు. ఆయన ఈ లైంగిక ఆరోపణలు తెరపైకి రావడం వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు.