national

ETV Bharat / snippets

నిరాహార దీక్ష విరమించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ - చర్చలకు కేంద్రం హామీ

Sonam Wangchuk Breaks Fast
Sonam Wangchuk Breaks Fast (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 8:11 PM IST

Sonam Wangchuk Breaks Fast :లద్ధాఖ్‌కు రాష్ట్రహోదాతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్లతో నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్‌ చుక్‌ తన దీక్షను విరమించారు. వాంగ్‌చుక్‌ను కలిసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తమ ప్రతిపాదనలను ఆయన ముందు పెట్టారు. అనతంరం వాంగ్‌చుక్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. లేహ్‌ అపెక్స్‌ బాడీ, కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ ప్రతినిధులతో డిసెంబర్‌ 3న చర్చలు జరిపేందుకు కేంద్రం అంగీకరించడంపై వాంగ్‌చుక్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది వరకు నిలిచిపోయిన చర్చలు డిసెంబర్‌ 3న కొనసాగుతాయని లద్దాఖ్ జాయింట్‌ సెక్రటరీకి, కేంద్ర హోం శాఖ అధికారులు ఈ మేరకు లేఖ అందజేశారని ఆయన చెప్పారు. ఇరువర్గాల నుంచి నిజాయితీగా, సానుకూలంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. 18మందితో కలిసి అక్టోబర్‌ 6న వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షకు దిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details