national

ETV Bharat / snippets

షారుక్​ ఖాన్​కు బెదిరింపులు- రూ.50లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాడట!

Shah Rukh Khan
Shah Rukh Khan (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Shah Rukh Khan Threat Call : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరిట వరుస బెదిరింపులు వస్తున్న వేళ, ఇప్పుడు మరో అగ్ర నటుడికి ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుక్‌ ఖాన్‌ను చంపేస్తానంటూ ఓ దుండగుడు ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫయాజ్‌ ఖాన్‌గా గుర్తించినట్టు తెలుస్తోంది. షారుఖ్‌ ఖాన్‌కు గతంలోనూ రెండు సార్లు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యలో షారుఖ్‌కు ముంబయి పోలీసులు భద్రతను పెంచారు.

ABOUT THE AUTHOR

...view details