national

ETV Bharat / snippets

మదర్సాలకు ఊరట- ఆ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court On UP Madrassa Law
Supreme Court On UP Madrassa Law (ANI)

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Supreme Court On UP Madrassa Law : ఉత్తర్‌ప్రదేశ్‌లో వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు భారీ ఊరట లభించింది. యూపీ మదర్సా విద్యా చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. ఆ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం, గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం కొట్టివేసింది.

ఉత్తర్​ప్రదేశ్‌ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు దానిని రద్దు చేసింది. అది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని ఆ సందర్భంగా తెలిపింది. దీంతో ఆ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రస్తుత తీర్పుతో 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details