national

ETV Bharat / snippets

2025 హజ్‌ విధానం ఖరారు - ప్రైవేటు గ్రూపుల కోటా పెంపు!

Haj Policy 2025
Haj Policy For 2025 Pilgrimage (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 8:05 AM IST

Haj Policy For 2025 Pilgrimage :మన దేశానికి లభించే హజ్‌ యాత్రికుల కోటాలో 70 శాతాన్ని ‘భారత హజ్‌ కమిటీ’కి, మిగిలిన 30 శాతాన్ని ప్రైవేటు గ్రూపు నిర్వాహకులకు కేటాయిస్తూ 2025 సంవత్సరానికి విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం 70 ఏళ్లు పైబడినవారికి, పురుషుల తోడు(మెహరం) లేకుండా వెళ్లే మహిళలకు, జనరల్‌ కేటగిరీకి ఇదే వరసలోనే ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త విధానం ప్రకారం, 65 ఏళ్లు పైబడినవారికి తొలి ప్రాధాన్యం లభిస్తుంది. మిగతా ప్రాధాన్యాల్లో మార్పులేదు. క్లిష్టమైన యాత్ర కావడంతో 65 ఏళ్లుపైబడినవారికి సహాయకుడు ఉండడం తప్పనిసరి. వీరు తమ భర్త, భార్య, సోదరుడు, సోదరి, కుమార్తె, కుమారుడు, అల్లుడు, కోడలు, మనవడు, మనవరాలు, మేనల్లుడు, మేనకోడలు, వీరిలో ఎవరైనా ఒకరిని సహాయకులుగా తీసుకువెళ్లవచ్చు. ఇతర బంధువులెవరినీ అనుమతించరు. రిజర్వుడు విభాగంలోనైతే 65 ఏళ్లు పైబడినవారు ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి ఉండదు.

ABOUT THE AUTHOR

...view details