Kangana Ranaut HC Notice :బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కంగనకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆ స్థానం నుంచి బరిలో దిగేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్ వాసి లాయక్ రామ్ నేగి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఈ విషయంపై ఆగస్టు 21లోగా వివరణ ఇవ్వాలంటూ కంగనను ఆదేశించింది.
కంగనా రనౌత్‌కు షాక్! ఎంపీ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు- హైకోర్టు నోటీసులు
Kangana Ranaut HC Notice (ANI)
Published : Jul 25, 2024, 10:27 AM IST
మండి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ 74,755 ఓట్లతో ఓడించారు. అయితే అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామపత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. అందులో రిటర్నింగ్ అధికారిని ప్రతివాదిగా చేర్చారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.