national

ఎన్నో ఆరోపణలు- మరెన్నో అనుమానాలు- IAS పూజపై విచారణకు కమిటీ

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 6:36 AM IST

IAS Pooja Khedkar
IAS Pooja Khedkar (ANI)

IAS Pooja Khedkar Issue : వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ నిజనిర్ధరణ చేయనుంది. పుణెలో బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో ఖేద్కర్‌ వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్‌ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details