national

ETV Bharat / snippets

పొలిటికల్ దంగల్​లో వినేశ్ ఫొగాట్ విజయం

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Haryana Elections Vinesh  Phogat
Haryana Elections Vinesh Phogat (ANI)

Haryana Elections Vinesh Phogat : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్​పై 6,015 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతకు గురయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం రేజ్లింగ్​కు గుడ్​బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లోకి చేరి జులానా స్థానం నుంచి పోటీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details