Census Be Conducted In India : జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, కులం అనే కాలమ్‌ను చేర్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రాజకీయ పార్టీలు మాత్రం కుల గణన నిర్వహించాలని గత కొద్దికాలంగా పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నవిషయం తెలిసిందే.
జనాభా లెక్కలకు సిద్ధమైన కేంద్రం! కులగణనపై సస్పెన్స్!
Census Be Conducted In India (Getty Images)
Published : Sep 15, 2024, 7:06 PM IST
2020 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్-19 వ్యాప్తి కారణంగా జనగణన వాయిదా పడింది. దీంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు చేస్తున్నారు. భారతదేశం 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనగణన నిర్వహిస్తోంది. మొత్తం జనాభా లెక్కల కోసం ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.