ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- ఏడుగురు నక్సలైట్లు మృతి
Published : Jun 7, 2024, 10:42 PM IST
Chhattisgarh Naxal Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పుర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)తో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను నారాయణ్‌పుర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిసి గతేడాది కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు మృతి చెందారు. మే 23న నారాయణ్‌పుర్ - బిజాపుర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.