national

ETV Bharat / snippets

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఐదుగురు మావోయిస్టులు మృతి!

encounter
encounter (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 7:17 PM IST

Naxals Killed In Encounter :మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్ద అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరౌలి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఓ జవాన్ తీవ్రంగా గాయపడగా, అతనిని హెలికాప్టర్‌లో నాగ్‌పుర్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. గడ్చిరౌలి, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ సరిహద్దు ప్రాంతం వద్ద పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీనితో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. గడ్చిరౌలి పోలీసు విభాగానికి చెందిన సీ60 కమాండో బృందాలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details