ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సిద్ధం' పేరిట వైసీపీ ఫ్లెక్సీలు - 'మేము సిద్ధమే' అంటూ జనసేన కౌంటర్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 11:56 AM IST

Published : Feb 5, 2024, 11:56 AM IST

YSRCP VS Janasena Flexi War in Bapatla District: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ సాగుతోంది. అధినేతలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రధాన రహదారులు పక్కన, మార్కెట్ కూడళ్లలో కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. 'సిద్ధం' అంటూ జగన్ చిత్రంతో వైసీపీ నేతలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా. దీనికి పోటీగా జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌ ఫొటోతో 'మేము సిద్ధమే' అంటూ భారీ ఫ్లెక్సీలను పెడుతున్నారు. అయితే తాజాగా బాపట్ల జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 

వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో కూడా వైసీపీ 'సిద్ధం' ఫ్లెక్సీలు చేశారు. అయితే వైసీపీ ఫ్లెక్సీకి ధీటుగా వేటపాలెంలో జనసేన ఇందుకు కౌంటర్ ఇచ్చింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు తాము కూడా వెనక్కు తగ్గమన్నట్లు "మేము సిద్ధమే" అంటూ జగన్ ఫ్లెక్సీలకు పక్కనే ప్రతి చోటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా చర్చినీయాంశమయింది.

ABOUT THE AUTHOR

...view details