ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ నేత కంచేటి మీడియాతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం, చోద్యం చూసిన పోలీసులు - Attack on Shop in Krosuru

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 10:02 PM IST

YSRCP Riotous Mobs Attacks: పల్నాడు జిల్లా క్రోసూరులో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కుమారునితో పాటు అతని అనుచరులు హల్​చల్​ చేశారు. కర్రలు పట్టుకుని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నానా హంగామా సృష్టించారు. అంతేకాకుండా టీడీపీ నేత కంచేటి సాయిని మీడియా సమావేశం నిర్వహించకుండా పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా కంచేటి ప్రెస్ మీట్ నిర్వహించటానికి వీల్లేదని బెదిరించారు. 

క్రోసూరు కూడలి వద్ద కంచేటి సాయి అనుచరుడు రాము ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రాము కాపు సామజిక వర్గానికి చెందిన వాడు కాగా, అతని దుకాణంపై వైఎస్సార్​సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడులు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్​ ఆధ్వర్యంలోనే జరిగాయాని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేత సాయి మండిపడ్డారు. వైఎస్సార్​సీపీ శ్రేణులు పట్టపగలు కర్రలతో వీరంగం సృష్టిస్తుంటే, అడ్డుకోవాల్సిన పోలీసులే చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీ మూకలు దుకాణాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, తనపై దాడి చేశారని రాము వాపోయారు. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు తీరుపై కాపు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details