ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతున్న వైసీపీ నాయకులు- అధికారుల వైఫల్యంపై విమర్శల వెల్లువ - Violating Model Code of Conduct
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 11:29 AM IST
YSRCP Leaders Violating Model Code of Conduct: ఎన్నికల కోడ్‌ను పటిష్ఠగా అమలు చేయాలని ఓ వైపు ఎస్ఈసీ(SEC) మొరపెట్టుకుంటున్న వైసీపీ సర్కార్ మాత్రం 'మా నిబంధనలు వేరే ఉంటాయిలే' అన్నట్లు వ్వహరిస్తోంది. నిబంధనలను పాటించకపోగా ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ స్థానిక మహిళలకు చెక్కులు అందజేశారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నతిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అపహాస్యం అవుతోంది. సిమెంట్ బల్లలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల్లో వైసీపీ రంగులు, నవరత్నాల లోగోలు దర్శనమిస్తున్నాయి. వైసీపీ కార్యాలయాలకు ఉన్న లైటింగ్ బోర్డులను సైతం అధికారులు తొలగించలేదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శిలాఫలాకాలు, విద్యుత్ స్తంభాలపై వైసీపీ జెండాలు, నినాదాలు ఇంకా అలానే దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.