బాపట్ల జిల్లాలో రెచ్చిపోతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు- ఎమ్మెల్యే ఏలూరి ఫ్లెక్సీని చించివేయడంపై టీడీపీ ఆగ్రహం - YSRCP Leaders Torn TDP Flexis
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 1:08 PM IST
|Updated : Mar 11, 2024, 1:26 PM IST
YSRCP Leaders Torn TDP Flexis in Bapatla District : ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు ఫ్లెక్సీ చించివేసిన ఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఇసుక దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట జరిగింది. క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీని వైఎస్సార్సీపీ నేతలు చించివేయడంపై టీడీపీ అభిమానులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను (Flexis) వైఎస్సార్సీపీ కార్యకర్తలు చింపినట్లు టీడీపీ నాయకులు (TDP Leaders) ఆరోపించారు.
TDP Leaders Angry on Flexi Issue : పోలీసులు వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని పార్టీ మండల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మేదరమెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీఎం జగన్ బహిరంగ సభకు తరలి వెళుతున్న కొందరు వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు తమ వాహనాలను ఇసుకదర్శి క్యాంపు కార్యాలయం వద్ద ఆపి మరీ ఏలూరి ఫ్లెక్సీని చించివేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.