ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వ్యతిరేకంగా ఉంటే సొంత పార్టీ, ప్రతిపక్షం తేడా లేదు- నష్టం చేయాల్సిందే, భయపెట్టాల్సిందే! - పంట పొలానికి సాగునీరు ఆపిన ఘటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 9:37 PM IST

YSRCP Leaders Stopped Water to Farm: వైఎస్సార్​సీపీ పార్టీ నేతల్లో సొంత పార్టీ, పరాయి పార్టీ అనే తేడా లేకుండా పోతోంది. తమకు వ్యతిరేకంగా ఉంటే చాలా వారు ఎవరైనా సరే వారికి నష్టం చేయాల్సిందే, భయపెట్టాల్సిందే అన్న ధోరణి కనిపిస్తోంది. తాజాగా తమ నేతకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఎమ్మెల్యే వర్గం వారు మరో వర్గానికి చెందిన రైతు పొలానికి సాగునీటిని నిలిపివేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సదరు నేత నిర్వాకంతో చేతికొచ్చిన పచ్చని పంట ఎండిపోయింది.

వివరాల్లోకి వెళ్తే..   తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిలు ఒక వర్గంగా కొనసాగుతున్నారు. అదే విధంగా మరికొందరు ముఖ్య నాయకులు మరో వర్గంగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమక్షంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన రాకేష్ రెడ్డి అనే యువకుడు సంజీవయ్య, కామిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారని అతని వరి పంటకు నెల రోజులుగా నీరు పోనివ్వకుండా చేశారు. పంటకు నీరు లేకపోవడంతో ఎండుముఖం పడుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరాకు 42వేలు పెట్టి సాగు చేశానని, పంట చేతికొచ్చే సమయంలో కామిరెడ్డి మనుషులను పంటకు నీరు రాకుండా చేశారని బాధితుడు వాపోయాడు. తనకు దాదాపు 3లక్షల రూపాయల వరకూ నష్టం కలిగిందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. వైఎస్సార్​సీపీ నాయకుల దుశ్చర్యలకు పాల్పడుతున్నా, అధిష్ఠానం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

ABOUT THE AUTHOR

...view details