ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బాపట్లలో వైఎస్సార్సీపీ నేతల దుశ్చర్య - ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు - NTR statue on fire - NTR STATUE ON FIRE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 12:28 PM IST

YSRCP Leaders Fire on NTR Statue in Bapatla District : బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయినవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి గ్రామ నడిబొడ్డులో ఉన్న ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పు పెట్టారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసి విగ్రహానికి నిప్పు అంటించారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులు ఎవరో తెలిసినా పోలీసులు మిన్నకుండిపోయారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్​ విగ్రహానికి నిప్పుపెట్టింది వైఎస్సార్సీపీ నేత సుందర్‌సింగ్‌ అని టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలోనూ ఎన్నికల ముగిసిన తర్వాత తమ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేత సుందర్‌సింగ్ దాడులు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. విగ్రహానికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్నిటీడీపీ నేత వేగేశన నరేంద్రవర్మ తీవ్రంగా ఖండించారు. సమస్యాత్మక గ్రామమైన పడమర పిన్నిబోయినవారిపాలెంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి ఘర్షణల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details