శ్మశాన వాటికను కూడా వదలని వైఎస్సార్సీపీ నేతలు- కబ్జా చెర నుంచి విడిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు - YSRCP Leaders Occupied Graveyard - YSRCP LEADERS OCCUPIED GRAVEYARD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 7:31 PM IST
YSRCP Leaders Occupied Graveyard: కబ్జాదారుల చెర నుంచి శ్మశాన వాటికను విడిపించాలని పుట్టపర్తి కలెక్టరేట్‌లో చిన్నకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ఎస్సీల కోసం కేటాయించిన శ్మశానాన్ని కబ్జా చేశారని కలెక్టర్‌కు బసంపల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. శ్మశానం చుట్టూ కంచె వేసి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎవరైనా మరణిస్తే పోలీసుల సహాయంతో ఖననం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి కబ్జాకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకుని తమకు శ్మశాన వాటికను విడిపించాలని కలెక్టర్‌కు విన్నవించారు.
"గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు ఎస్సీలపై దాడులకు దిగుతూ దౌర్జన్యంగా శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించారు. దాని చుట్టూ కంచె వేసి కరెంట్ కూడా పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో చనిపోయిన వ్యక్తిని పూడ్చేందుకు కూడా పోలీసులను వెంట తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చింది." - బసంపల్లి గ్రామస్థులు