గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలోకి భారీగా చేరికలు - YSRCP Leaders Joined TDP - YSRCP LEADERS JOINED TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 5:55 PM IST
YSRCP Leaders Joined TDP in Giddalur Constituency: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ భారీ షాక్ తగిలింది. కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం చేరారు. గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకటసుబ్బయ్యతో పాటు ఐదుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ముత్తుముల ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. గిద్దలూరు నగర పంచాయతీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో గిద్దలూరు నగర పంచాయతీ అభివృద్ధి చెందుతుందని నమ్మి వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు తెలిపారు. గతంలో నీటి సమస్య అధికంగా ఉంటే ఆ సమస్యకు చంద్రబాబు 89 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అనే అంశాలపై గతంలో ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.