ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అన్నమయ్యలో వైఎస్సార్సీపీ బరితెగింపు - టీడీపీ ఏజెంట్లపై దాడి, కిడ్నాప్​ - YSRCP Leaders Attack - YSRCP LEADERS ATTACK

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 11:49 AM IST

YSRCP Leaders Attack TDP Leaders in Annamaya District : ఏపీలో జరిగే లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నేతలపై దాడులకు దిగారు. 201 పోలింగ్​ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా వారి ఫారాలు లాక్కెళ్లారు. అనంతరం టీడీపీ ఏజెంట్​ సుభాష్​ అనే వ్యక్తిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్​ చేశారు. దీంతో పోలింగ్​ కేంద్రం వద్ద ఆందోళన నెలకొంది. 

పుల్లంపేట మండలం మల్లెవారిపల్లిలో అధికార నేతలు దౌర్జన్యం చేశారు. టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్​ అనే వ్యక్తిపై వైఎస్సార్సీపీ నేతలు చితకబాదినారు. ఈ సంఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందరని టీడీపీ నేత పుట్టా సుధాకర్​ వెల్లడించారు. పోలింగ్​ కేంద్రాల్లో పోలీసులు సిబ్బంది తక్కువగా ఉన్నారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ ఏజెంట్లపై దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

ABOUT THE AUTHOR

...view details