ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల విధ్వంసకాండ- టీడీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు - YSRCP Leaders Attack on TDP Agents - YSRCP LEADERS ATTACK ON TDP AGENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 3:58 PM IST

YSRCP Leaders Attack on TDP Agents: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లపై విచక్షణారహితంగా కర్రలు, కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారు. ప్రజలను భయపెట్టటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తం గ్రామంలో అర్ధరాత్రి 12గంటలకు టీడీపీ నేతల ఇళ్లపై వైఎస్సార్సీపీ నేతలు రాళ్లు రువ్వారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. 

తెలుగుదేశం పార్టీ బూత్‌ ఏజెంట్‌ బాబు, క్లస్టర్‌ ఇంఛార్జ్‌ నందగోపాల్‌పై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో టీడీపీ నాయకులపై దాడి చేస్తుండగా నెల్లిపట్ల వాసి కేశవులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయనపై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు బాధితులు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కేశవులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అర్ధరాత్రి వరకూ దాదాపు అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ నేతలు విధ్వంసకాండతో చెలరేగిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details