ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్​ - మహిళ వైసీపీ నేతల దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 4:26 PM IST

YSRCP Leaders Attack on TDP Activists in Anantapur District : అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) అనుచరులు ఓ మహిళపై దాడి చేసిన ఘటన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ సానుభూతిపరురాలైన మహిళపై వైఎస్సార్సీపీ నేతల మూకుమ్మడిగా దాడి (Attack) చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్​గా మారాంది. పట్టణంలోని శాస్త్రినగర్​లో తెలుగుదేశం సానుభూతిపరులైన వెంకట సుబ్బమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. వెంకటసుబ్బమ్మ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు పాత కక్షల నేపథ్యంలో వారిని కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. 

తీవ్ర గాయాలైన వెంకటసుబ్బమ్మ అనంతపురం ఆస్పత్రిలో (Hospital) చికిత్స తీసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కావడంతో దీనిపైన పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అనుచరులు తీరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details