ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పంటభూముల వద్ద వైసీపీ నేతల దౌర్జన్యం- ఫొటోలు తీసేందుకు వెళ్లిన టీడీపీ సానుభూతిపరులపై దాడి - YSRCP Attack TDP Leaders - YSRCP ATTACK TDP LEADERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 3:11 PM IST

YSRCP Leader Attack on TDP Followers in Kurnool District : ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా వైఎస్సార్సీపీ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. వారి అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. గత ప్రభుత్వంలో హయాంలో లాగానే ఇప్పుడు కూడా ఖాళీగా భూమి కనిపిస్తే చాలు దౌర్జన్యంగా దున్నుతున్నారు. వారిని ప్రశ్నించిన వారిపై ఎదురు దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
Nandavaram Kurnool District : కర్నూలు జిల్లా నందవరం మండలం జోహారాపురం గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వారు పొలాన్ని దౌర్జన్యంగా దున్నుతుండగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకోవడానికి వెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకులు పొలాన్నిదౌర్జన్యంగా దున్నుతుండాగా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే టీడీపీ సానుభూతిపరులపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details