ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్యాపిలిలో దారుణం - అప్పు చెల్లించలేదని రైతును చితకబాదిన వైసీపీ నాయకుడు - YCP LEADER ATTACK ON FARMER - YCP LEADER ATTACK ON FARMER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 12:01 PM IST

YSRCP Leader Attack On Farmer At Papili Bus Stand: అప్పు తీర్చలేదని ఓ రైతుపై వైఎస్సార్సీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలిలో చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రైతు ఉండగా బైక్​పై అటుగా వెళుతున్న లక్ష్మి నారాయణ రెడ్డి వాహనాన్ని ఆపి రైతుతో వాగ్వాదానికి దిగాడు. అతనితో గొడవ పడి కొట్టి, బైకుపై ఎక్కించుకొని వెళ్లడానికి ప్రయత్నించగా ఇద్దరూ కిందపడిపోయారు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో (CC tv footage) నమోదయ్యాయి. 

అనంతరం బాధిత రైతును బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు (PS) తీసుకెళ్లాడు. ప్యాపిలి మండలానికి చెందిన రైతు కృష్ణ మూర్తి, అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తూర్పు లక్ష్మినారాయణ రెడ్డి దగ్గర 40 వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. గత రెండేళ్లుగా వడ్డీ చెల్లిస్తున్నానని రైతు పేర్కొన్నాడు. ఈ ఏడాది పంట నష్టం రావటంతో వడ్డీ కట్టలేకపోయానని, అందుకే తనపై నారాయణ రెడ్డి దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చూసిన స్థానికులు కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. రైతును కొట్టి, లాక్కొని వెళ్లే దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.  

ABOUT THE AUTHOR

...view details