వైసీపీ అండతో కోర్ట్ ఆదేశాలు తుంగలో కలిపిన జగనన్న సారథులు - YSRCP Land Corruption in Satya Sai - YSRCP LAND CORRUPTION IN SATYA SAI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 5:36 PM IST
YSRCP Land Corruption in SatyaSai district : సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని వైఎస్సార్సీపీ నేతల అండతో చదును చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 68లోని 62 ఎకరాల భూమిపై (Land) హైకోర్టులో వివాదం నడుస్తోంది. భూమిని యథాతథ స్థితిలో ఉంచాలని హైకోర్టు (High- Court) ఉత్తర్వులు ఉన్నా వాటిని వైఎస్సార్సీపీ నేతలు ఉల్లంఘించారు.
YSRCP Grabed land From Common Man in Erramanchi : పది జేసీబీలతో భూమి చదును చేస్తున్నారని పోలీసులకు (Police) ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితుడు గిరినాథ్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి తమ భూమిని కాపాడాలని గిరినాథ్ కోరుతున్నారు. గిరినాథ్ కుటుంబ సభ్యులు జేసీబీలను అడ్డుకునే యత్నం చేయగా, వైఎస్సార్సీపీ నేతల అండతో వ్యతిరేక వర్గీయులు అనేక మంది భూమి వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.