ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శిథిలావస్థకు చేరిన కుందేరు వంతెన- బస్సు సౌకర్యం నిలిపివేయటంతో 13 గ్రామాల ప్రజల అవస్థలు - KUNDERU BRIDGE - KUNDERU BRIDGE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 7:50 PM IST

People Facing Problems with Dilapidated Bridge: వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 13 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రెండు పిల్లర్లను నిర్మించడం చేతకాక వంతెన నిర్మాణాన్ని గాలికొదిలేసింది. కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో గతంలో నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో బస్సు సౌకర్యం నిలిపేశారు. 

తెలుగుదేశం హయాంలో సుమారు 70 శాతం పనులు పూర్తయి ఉన్న వంతెనను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. వంతెన శిథిలావస్థకు చేరటంతో పలు గ్రామాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఈ ప్రాంతవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూల్చడం తప్ప వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నిర్మించడం తెలియని  స్థానికులు మండిపడుతున్నారు. కుందేరు నదిపై ఉన్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే సుమారు 13 గ్రామాల ప్రజలు సులువుగా రాకపోకలు సాగిస్తారని చెబుతున్నారు. కుందేరు వంతెన నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details