ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు - దారికాచి మరీ టీడీపీ నేతపై దాడి - టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తల దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 1:42 PM IST

YSRCP Followers Attack on TDP Leader: రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులు (YSRCP Attacks) ఆగట్లేదు. వారి అక్రమాలకు అడ్డొచ్చిన ఎవరినీ వదలకుండా విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులను సైతం వలకుండా పత్రికా కార్యాలయాలపై కూడా రాళ్లు రువ్వుతున్నారు. ఇలా వైసీపీ నేతల దాష్టీకానికి అడ్డేలేదన్నట్టు వ్యవహిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బాపులపాడులో టీడీపీ నేత హరికృష్ణ (TDP Leader Harikrishna)పై వైసీపీ కార్యకర్తలు అమానుషంగా దాడికి తెగబడ్డారు. 

కొంతకాలంగా బాపులపాడు తెలుగు యువత అధ్యక్షుడు (Bapulapadu Telugu Youth President) చెరుకూరి హరికృష్ణను వైసీపీ కార్యకర్తలు (YSRCP Followers) వేధిస్తున్నారు. గురువారం రాత్రి బైక్‌పై వెళ్తున్న హరికృష్ణను దారికాచి మరీ రెచ్చగొట్టి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన హరికృష్ణ ఏలూరు ప్రభుత్వాస్పత్రి (Elur Govt Hospital)లో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతపై వైసీపీ శ్రేణుల దాడి (YSRCP Attack on TDP Leader Harikrishna)ని రాష్ట్ర తెలుగు యువత ఖండించింది. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు (TDP Leaders) మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details