ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కదిరి వైసీపీలో భగ్గమన్న అసమ్మతి- ఎమ్మెల్యే శంకుస్థాపనలను అడ్డుకున్న సర్పంచ్ - కదిరిలో బండ్లపల్లి సర్పంచ్​ నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 10:00 PM IST

YSRCP Class War in Kadiri Constituency: శ్రీ సత్యసాయి జిల్లాలోని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని తలుపుల మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్​ అడ్డుకున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను తనకు సమాచారం ఇవ్వకుండా, తాను ప్రతినిథ్యం వహిస్తున్న గ్రామంలో శంకుస్థాపన ఎలా చేస్తారని, గ్రామ సర్పంచ్​ కొండారెడ్డి అడ్డుకునేందుకు యత్నించారు. సర్పంచ్​ను పట్టించుకోకుండా ఎమ్మెల్యే పనులను ప్రారంభించి ముందుకు సాగారు. దీంతో సర్పంచ్ మరో శిలఫలకం వద్ద బైఠాయించారు. తనకు ఎందుకు సమాచారం అందిచలేదని, ఆహ్వానించలేదని సర్పంచ్​ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దీనిపై సమాధానం చెప్పేవరకు అక్కడ్నుంచి లేచేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో పోలీసులు సర్పంచ్​ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. సొంత పార్టీ సర్పంచ్​పైనే ఎమ్మెల్యే సైకోలా ప్రవరిస్తున్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అదే పార్టీకి చెందిన సీనియర్​ నాయకుడు పూల శ్రీనివాస రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే బండ్లపల్లి సర్పంచ్​ పూల శ్రీనివాస రెడ్డికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details