గత ఎన్నికల ఫలితాలను తలదన్నేలా ఈసారి విజయం: జగన్ - Jagan Meeting With IPack Team - JAGAN MEETING WITH IPACK TEAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 9:59 PM IST
YS Jagan Meeting With I-Pack Team in Vijayawada: ఎన్నికల కౌంటింగ్ అనంతరం యావత్ దేశం ఏపీ వైపు చూస్తుందని, ఆ విధంగానే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 2019లో వైసీపీ సాధించిన సీట్ల కంటే ఎక్కువగానే ఈ సారి అసెంబ్లీ, లోక్ సభ సీట్లు వస్తాయని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ బెంజి సర్కిల్లోని కార్యాలయంలో ఐప్యాక్ టీం లీడర్ రిషిరాజ్ సింగ్ సహా బృంద సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. పోలింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలపై సభా వేదికగా తొలిసారి స్పందించారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు వచ్చాయని ఈసారి అంతకంటే ఎక్కువగానే సీట్లు గెలవబోతున్నట్లు జగన్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయన్నారు. ఏడాదిన్నరగా ఐప్యాక్ టీం చేసిన కృషి గొప్పదని, రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా రిషిరాజ్ సింగ్ను జగన్ అభినందించారు.