ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అత్యాచారానికి యత్నించిన యువకుడు - రోకలిబండతో కొట్టి చంపిన వివాహిత - crime news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 10:35 AM IST

Young Man Murdered: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో ఓ వివాహిత ఇంట్లోకి వెళ్లిన ప్రతాప్‌ (30) ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి రోకలి బండతో అతని తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం ఆమె ధర్మవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయింది. స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రతాప్‌ టింబర్‌ డిపోలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య మృతి చెందింది. కొంతకాలంగా కేతిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న వివాహితను ప్రతాప్ లైంగికంగా వేధించేవాడు. 

ఆదివారం వివాహిత  భర్త ఇంట్లో లేని సమయంలో ప్రతాప్‌ వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా, ఆమె రోకలిబండతో తలపై కొట్టింది. దీంతో ప్రతాప్ తలకు బలమైన గాయమైంది. ఆమె పోలీసులకు జరిగిన విషయాన్ని తెలపడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో పడి ఉన్న ప్రతాప్‌ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రతాప్ తల్లి లక్ష్మీనరసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details