వైసీపీ నేతల అరాచకం - 'సిద్ధం' సభకు పిలిచినా రాలేదని కర్రలు, రాడ్లతో దాడి - YCP Leaders Attacked Person
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 5:21 PM IST
YCP Leaders Attacked Person not coming Siddham Sabha in Bapatla District : బాపట్ల జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. 'సిద్ధం' సభకు పిలిచినా రాలేదంటూ ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తలారి ధనచక్రవర్తిని శనివారం రాత్రి వైసీపీ నేత ఆంజనేయులు సిద్ధం సభకు రమ్మని పిలిచారు. అయితే తాను మిర్చి పంట వేశానని తెలిపారు. ఆదివారం కోత కోసేందుకు కూలీలు వచ్చారని ఆంజనేయులకు తెలయజేశాడు. సభకు రావడం కుదరదని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన మరో వైసీపీ నేత రామాంజనేయులు, ఆయన కుమారులు ధనచక్రవర్తిని కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారు. అక్కడితే ఆగకుండా నువ్వెంత నీ స్థాయి ఎంత? మేము పిలిస్తే రావా అంటూ చితకబాదారు. కర్రలు, రాడ్లతో రక్తమొచ్చేలా కొట్టారు. బాధితుడ్ని కుటుంబసభ్యులు అద్దంకి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైనా చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రోజురోజూకు వైసీపీ నాయకుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.